దస్తురాబాద్: విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెచ్‌ఈఓ వేణు గోపాల్ అన్నారు. మండలంలోని మల్లాపూర్ గొండు గూడెం గ్రామంలో బాలుర ఆశ్రమ పాఠశాలలో బుధవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… 60 మంది విద్యార్థులకు రక్త నమూనా పరీక్షలు, కిడ్ని, కాలేయంకు కుష్టు సంబంధించిన పరీక్షలు చేసినట్లు తెలిపారు.
విద్యార్థులకు చేసిన పలు రకాల టెస్ట్‌లను టిహబ్ వాహనం ద్వారా నిర్మల్ జిల్లా ఆసుపత్రికి పంపించడం జరిగిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించినప్పుడు ఎలాంటి ఆరోగ్యం సమస్యలు రావు అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌యువో రాజు, వైద్య సిబ్బంది రవి, రాజేందర్, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.