Wednesday, January 22, 2025

కు.ని ఆపరేషన్లు నిలిపివేత

- Advertisement -
- Advertisement -

Centre Govt Over 1. lakh crore received by GST

ఇబ్రహీంపట్నం ఘటనపై నివేదిక వచ్చే వరకు డిపిఎల్ ఆపరేషన్లు బంద్
ఇతర విధానాల్లో యథావిధిగా కొనసాగనున్న సర్జరీలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 25న 34 మంది మహిళలకు శస్త్రచికిత్సలు ని ర్వహించారు. ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మృతి చెందటంతో పాటు పలువురు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఈ నిర్ణ యం తీసుకున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. మృతులకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టుతో పాటు, ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు క్యాంపులను నిలిపివేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. నివేదికల ఆధారంగా భవిష్యత్తులో క్యాంపుల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొంది. ఇబ్రహీంపట్నం ఘటనపై సమగ్ర నివేదిక వచ్చే వరకు ప్రత్యేక క్యాంపుల్లో డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ(డిపిఎల్) కుటుం బ నియంత్రణ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించామని తెలంగాణ వైద్య విధాన పరిషత్(టివివిపి) కమిషన్ అజయ్‌కుమార్ తెలిపారు. ఇతర విధానాల్లో కుటుంబ నియంత్రణ సర్జరీలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. పూర్తి కు.ని ఆపరేషన్లు నిలిపివేశారన్నది అవాస్తమని స్పష్టం చేశారు.

TS Govt stops Family planning operations

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News