- Advertisement -
హైదరాబాద్: ఈ ఏడాది పదో తరగతి పరీక్షల విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కరోనా కారణంగా అనుకున్న విధంగా తరగతులు జరగకపోవడంతో అకాడమిక్ ఇయర్ 2020-2021కు గాను 11 పరీక్ష్ పేపర్లను 6 పరీక్ష పేపర్లకు కుదిస్తూ రాష్ట్ర విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్‌కు ఒకే పేపర్ ఉండేలా మార్పులు చేసింది. ఇక, సెకండ్ లాంగ్వేజ్‌లో ఫిజిక్స్, బయాలజీలకు వేర్వేరుగానే పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, ఎప్పటిలాగే బోర్డు పరీక్షలకు 80 మార్కులు, ఎఫ్ఎ పరీక్షలకు 20 మార్కలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. అయితే, ఈ 6 పరీక్షల విధానం 2020-2021 విద్యా సంవత్సరానికి మాత్రమేనని ఉత్తర్వులో పేర్కొంది.
TS Govt to Change SSC Exam Pattern 2021
- Advertisement -