హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ పేరుతో మార్చి 12వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ పేరుతో దేశవ్యాప్తంగా వేడుకలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తెలంగాణలోనూ ఈ ఉత్సవాలను నిర్వహించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో తెలంగాణ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. మార్చి 12వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలను జరుపాలని సూచించారు.దీంతో మార్చి 12న హైదరాబాద్, వరంగల్ లో ప్రారంభ కార్యక్రమాలు జరపాలని సిఎం నిర్ణయించారు. ఈ ఉత్సవాలకు రూ.25 కోట్లు కేటాయించనున్నట్లు సిఎం తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి ఉంటారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.
TS Govt to decide Celebrate Azadi ka Amrut Mahotsav