Saturday, November 23, 2024

ఓటిఎస్ పథకం గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ఓటిఎస్ పథకం గడువు పొడిగింపు
పన్నుల మేళాల పర్యవేక్షణకు 9 మంది అధికారుల నియామకం

TS Govt to Release guidelines on Sada Bainama soon

మనతెలంగాణ/హైదరాబాద్: పట్టణాల్లో ఆస్తిపన్ను బకాయిల కోసం తెచ్చిన ఓటిఎస్ పథకం గడువు ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు గడువు పెంచుతూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 ఏడాదికి 90 శాతం వడ్డీ మినహాయింపుతో బకాయిలు చెల్లించే వీలు కల్పించింది. దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించింది. జీహెచ్‌ఎంసి సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో 2019-20 సంవత్సరానికి ఆస్తిపన్ను బకాయిల చెల్లింపు కోసం అమలు చేస్తున్న ఓటిఎస్ పథకం గడువును ప్రభుత్వం పొడిగించింది. బకాయిలను 90 శాతం వడ్డీ మినహాయింపుతో చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఓటిఎస్‌కు అవకాశం కల్పించింది. ఆస్తి పన్ను బకాయి దారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నెలాఖరులోపు వంద శాతం పన్నుల వసూలే లక్ష్యంగా నిర్ధేశించుకున్న పురపాలకశాఖ దీనికోసం ప్రత్యేకాధికారులను నియమించింది. జీహెచ్‌ఎంసి మినహా మిగతా పట్టణాలు, నగరాల్లో ప్రతి సోమ, బుధ, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో పన్నుల వసూలు కోసం ప్రత్యేక మేలాలు నిర్వహించాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన పురపాలకశాఖ ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వీలుగా తొమ్మిది మంది ప్రత్యేకాధికారులను నియమించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News