Friday, November 15, 2024

31మంది ఐఏఎస్‌ల బదిలీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. అదే విధంగా వె యిటింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పో స్టింగ్‌లు కూడా ఇచ్చింది. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు నూతన బాధ్యతలు చేపట్టబోతున్నారు. 1990 బ్యాచ్‌కు సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్, ఆయుష్ డైరెక్టర్‌గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య,

హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ ఎస్.స్నేహ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా ప్రియాంక ఆల, ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్, ఆర్ధికశాఖ సంయుక్త కార్యదర్శిగా కె. హరిత, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండిగా అలగు వర్షిణి, క్రీడల సంచాలకులుగా కొర్రా లక్ష్మి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ హైమావతి, పర్యాటక శాఖ సంచాలకులుగా కె. నిఖిల్, వ్యవసాయశాఖ ఉప కార్యదర్శిగా సత్యశారదాదేవి, టిఎస్ ఫుడ్స్ ఎండిగా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటడిఎ పీవోగా ప్రతీక్ జైన్, సెర్ప్ సీఈవోగా పొట్రు గౌతమ్,నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా మంద మకరందు, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
39 మంది స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌లతో పాటు డిప్యూటీ కలెక్టర్‌ల బదిలీ..
పలువురు స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌లతో పాటు డిప్యూటీ కలెక్టర్‌లను బదిలీలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ జిఓ 213లో ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 39 మంది స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌లతో పాటు డిప్యూటీ కలెక్టర్‌లను పలు జిల్లాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా వెయిటింగ్‌లో ఉన్న కొందరికీ పోస్టింగ్‌లు ఇచ్చింది. మరో 13 మంది స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌లతో పాటు డిప్యూటీ కలెక్టర్‌లను ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News