Wednesday, January 22, 2025

నేడు విధుల్లో చేరాల్సిందే

- Advertisement -
- Advertisement -

నేడు విధుల్లో చేరాల్సిందే
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం
వార్నింగ్ విధుల్లో చేరకపోతే ఉద్యోగం
నుంచి తొలగిస్తామని హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై ప్రభుత్వం సీరియన్ అయ్యింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం నోటీసులు జారీ చేశారు. అంతకుముందు ఈ విషయమై పంచాయతీరాజ్ శాక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి జెపిఎస్‌ల సమ్మె గురించి వివరించారు. సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతే జెపిఎస్‌లకు నోటీసు జారీ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆ నోటీసులో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు (జెపిఎస్) యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్టవిరుద్దమని అన్నారు. ప్రభుత్వంతో జెపిఎస్‌లు చేసుకున్న అగ్రిమెంట్ బాం డ్‌ను ఉల్లంఘిస్తూ యూనియన్‌గా ఏర్పడి తమ సర్వీసు డిమాండ్‌తో ఏప్రిల్ 28న సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.

“జూనియర్ పంచాయతీ సెక్రటరీగా, సంఘాలు, యూనియన్ లలో చేరను” అని సంతకం చేశారని, ఒప్పందం ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మెకు దిగే హక్కు లేదని పేర్కొన్నారు. ఈ వాస్తవాలు తెలిసినప్పటికీ జెపిఎస్‌లు ఒక యూనియన్‌గా ఏర్పడ్డారని, చట్టవిరుద్దంగా సమ్మెకు వెళ్ళారని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి సమ్మెకు దిగడం వల్ల జెపిఎస్‌లు తమ ఉద్యోగాలలో కొనసాగే హక్కును కోల్పోయారని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో జెపిఎస్‌లకు చివరి అవకాశాన్ని ఇస్తోందన్నారు. మే 9 సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరని పంచాయతీ కార్యదర్శులు అందరూ టర్మినేట్ అవుతారని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News