- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన ఫిర్యాదులు, విచారణ కోసం అన్ని జిల్లాల్లో అంబుడ్స్‌మెన్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి జిల్లాకు ఒకరు లేదా ఇద్దరిని అంబుడ్సమెన్‌లుగా నియమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ధి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో ఈ నియామకాలు చేపట్టనుంది.
TS Govt will be set up Ombudsman System
- Advertisement -