- Advertisement -
పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణజలాలు తరలించకుండా ఎపిని ఆపాలి
కృష్ణనది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఇఎన్‌సి లేఖ
మనతె లంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. కెఆర్‌ఎంబీ చైర్మన్‌కు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరు తరలించకుండా ఆపాలని కెఆర్‌ఎంబీకి ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. నాగార్జున సాగర్‌కు నీటి అవసరం ఉందని, అందులో భాగంగా ఎపి ప్రభుత్వం నీటి తరలించడా న్ని ఆపాలని ఆయన కోరారు. ఎపి తన పరిమితికి మించి నీరు తీసుకు ంటోందని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 25 టిఎంసీల నీటిని తరలించిందని రజత్‌కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఎపి 10.48 టిఎంసీలే తీసుకోవాలని, అది నీటిని వాడుతున్న ఎపి ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఆయన ఆ లేఖలో తెలిపారు. కెఆర్‌ఎంబీతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఈ లేఖ ప్ర తిని రాష్ట్ర ప్రభుత్వం పంపింది.
- Advertisement -