Sunday, November 24, 2024

ముగిసిన వర్సిటీల సెర్చ్ కమిటీల సమావేశాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్లను ఎంపిక చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసే సెర్చ్ కమిటీల సమావేశాలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 8వ తేదీన విసిల ఎంపికకు సెర్చ్ కమిటీల సమావేశాలు ప్రారంభం కాగా, బుధవారం చివరగా పాలమూరు యూనివర్సిటీ, తెలుగు వర్సిటీ, జెఎన్‌ఎఎఫ్‌ఎఫ్‌ఎయు వర్సిటీల సెర్చ్ కమిటీల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 11 యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్లను నియమించాల్సి ఉండగా, అందులో ఆర్‌టియుకెటికి మాత్రం నేరుగా విసిని నియమించనున్నారు. ఒయు, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధఋ, జెఎన్‌టియుహెచ్, జెఎన్‌ఎఎఫ్‌ఎయు, తెలుగు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాల విసిలను మాత్రం సెర్చ్ కమిటీ ద్వారా నియమించనున్నారు. వైస్ ఛాన్స్‌లర్ల నియామకం కోసం 2019 జులై 23వ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, అప్పటి నుండి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. గత ఏడాది గత ఫిబ్రవరిలో నియామకం మూడు వారాలలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. అయినా వైస్ ఛాన్స్‌లర్ల నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సిఎస్ సోమేష్‌కుమార్ పర్యవేక్షణలో విసిల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.

TS Govt’s Search Committee meetings end on Varsities VCs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News