Monday, December 23, 2024

గురుకుల డిగ్రీ కాలేజిల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే బిసి సంక్షేమ (ఎంజెపిటిబిసిడబ్ల్యూ), ఎస్‌సి (టిఎస్‌డబ్ల్యూ)సంక్షేమ, ఎస్‌టి (టిటిడబ్ల్యూ) సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష- ఆర్‌డిసి సెట్ -2024 నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా డిగ్రీ కోర్సుల కు అడ్మిషన్లు జరుగుతాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బిసి సంక్షేమ గురుకుల సొసైటీలో 15 బాలుర కళాశాలలు, 15 మహిళా కళాశాలలు, ఎస్‌సి సంక్షేమ గురుకుల సొసైటీలో 26 మహిళా కళాశాలలు, ఎస్‌టి సంక్షేమ గురుకుల సొసైటీలో 6 బాలుర కళాశాలలు, 15 మహిళా కళాశాలలు ఉన్నాయి. 2024లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. డిగ్రీలో ప్రవేశం కొరకు ఆయా కళాశాలలో బిఎ (హెచ్‌పిఎస్, ఈపిఎస్‌పిఎ,

ఈపిహెచ్, హెచ్‌ఈపి, ఈపిపి, హెచ్‌పిఈ, హెచ్‌ఈఎస్, ఐఆర్‌ఈపి, పిపిజిఈపి), బికాం (సిఎ, బిఎ, జి), బిఎస్‌సి (ఎంపిసి, ఎంపిసిఎస్, ఎంఎస్‌సిఎస్, బిజెడ్‌సి, ఎంబిజెడ్‌సి, ఎంపిజి, ఎంఎస్‌డిఎస్, బిజెడ్‌జి, బిటిబిసిసి, ఎంఈసిఎస్, బిబిసిసి, ఎన్‌జెడ్‌సి, ఎంఎస్‌ఎఐ, ఎంఎల్, ఎంబిజెడ్‌జి, బిబిటిసి, ఎఎన్‌పిహెచ్‌బిసి) కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు బిహెచ్‌ఎంసిటి, బిబిఎ, బిఎఫ్‌టి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి కోర్సులో 40 సీట్లు ఉన్నాయి. ఈ గురుకుల కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు పూర్తి ఉచితంగా విద్యా, భోజన వసతి అందిస్తారు. యూనిఫామ్స్, నోట్ బుక్స్, టెక్ట్ బుక్స్ మొదలైన సదుపాయాలు అందించబడుతాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యావకాశాలు అందుకునేలా విద్యార్థులను సంసిద్ధులుగా చేస్తారు. ప్రాంగణ నియామక అవకాశాలు కల్పించడం జరుగుతుంది.

కావునా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురుకుల విద్యాలయాల సంస్థ తెలిపింది. ఆయా కోర్సుల్లో చేరుటకు విద్యార్థులు ఆన్‌లైన్ లో tsrdccet.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 21 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. టిజిఆర్‌డిసి సెట్ 2024 ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 28న జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News