హైదరాబాద్ : తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు జూన్ 6న పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో (ఇంగ్లీష్ మీడియం ఎంపిసి, బిపిసి, ఎంఇసి) లో ప్రవేశం కొరకు తెలంగాణ లోని 33 జిల్లాల విద్యార్థుల నుండి ఇదివరకే ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారరెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో జూన్ 6న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ తెలిపింది. ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడుతుంది. ప్రవేశాల కోసం మొత్తం 40,281విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మే 28 నుండి హాల్‌టికెట్ పొందవచ్చని సంస్థ కార్యదర్శి సిహెచ్ రమణకుమార్ తెలిపారు.
జూన్ 6న గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష
- Advertisement -
- Advertisement -
- Advertisement -