Sunday, December 22, 2024

గురుకులాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయి

- Advertisement -
- Advertisement -

TS Gurukul Schools are the compass of the india

మంత్రి కొప్పుల ఈశ్వర్
ఎంబిబిఎస్,ఐఐటిల్లో చదువుతున్న విద్యార్థులకు
ల్యాప్‌టాప్‌లు, నగదు పురస్కారాలు అందజేత

హైదరాబాద్ : అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న మన గురుకులాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఎస్‌సి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురుకులాల విద్యార్థులు అన్ని రంగాలలో ప్రతిభ చూపుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎంబిబిఎస్,ఐఐటిల్లో చదువుతున్న విద్యార్థులకు మాసబ్ ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో మంగళవారం మంత్రి ల్యాప్‌టాప్‌లు, నగదు పురస్కాలు పంపిణీ చేశారు. 151 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, రూ. 50వేల చొప్పున 196 మందికి నగదు పురస్కారాలు,క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చిన 11మందికి నగదు పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో సిఎం ఒఎస్‌డి రాహూల్ బొజ్జ, స్పెషల్ ఆఫీసర్ విజయ్ కుమార్,కమిషనర్ యోగితారాణా,ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, అధికారులు వర్షిణి, హన్మంతు నాయక్, చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజ్ఞానవంతమైన సమాజంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారని అన్నారు. ముఖ్యమంత్రి కలల మేరకు ఇవి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ, దేశానికి,ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.మారుమూల ప్రాంతాలు,పేద వర్గాల నుంచి వచ్చిన బాలబాలికలు చక్కగా చదువుతున్నారని, ఆత్మ విశ్వాసం,స్థైర్యంతో ముందుకు సాగుతుండటం సంతోషంగా ఉందని చెప్పారు. గురుకుల విద్యార్థులను జీవితంలో గొప్పగా స్థిరపడే విధంగా తీర్చిదిద్దుతున్న అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సామాజిక సేవలో భాగంగా ఈ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించిన స్ట్రీట్ సాఫ్ట్ వేర్ కంపెనీని మంత్రి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News