Monday, December 23, 2024

గురుకులాల్లో ప్రవేశాలకు రెండో జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

TS Gurukul second admission list Released

హైదరాబాద్ : గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల రెండో జాబితాను విడుదల చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను సాంఘీక, గిరిజన, బిసి, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల రెండో జాబితాను విడుదల చేసినట్లు విటిజి సెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన గురుకుల పాఠశాలల్లో ఈ నెల 24 నుండి 29వ తేదీ లోగా విద్యార్హత టిసి, క్యాస్ట్, ఆదాయం, మార్కుల మెమొ, బోనఫైడ్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. అభ్యర్థులు ప్రవేశాలకు సంబంధించిన వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 45678 కు సంప్రదించాలని సూచించారు. వెబ్‌సైట్స్ www.tgcet.cgg.gov.in, www.tswreis.ac.in నుండి రెండో జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News