Monday, December 23, 2024

మెరిట్ ప్రకారమే గురుకుల సీట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల సంస్థలో సీట్లు మెరిట్ ప్రకారమే కేటాయిస్తున్నామని సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు అన్నారు. సీటు రాని వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఆఫీస్, స్కూల్ చుట్టూ తిరగవద్దని ఆయన సూచించారు. 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సుల్లో 2023- 24 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో వచ్చిన మార్కులు, మెరిట్ ప్రాతిపదికన ప్రవేశాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. మెరిట్ ప్రకారం మొదటి విడత, రెండవ విడత, మూడవ విడత ప్రవేశాలు ముగిసిన తరువాత ఇంకా ఏమైనా ఖాళీలు ఉన్న ట్లైతే ఆన్‌లైన్ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సీటు కేటాయించబడుతాయన్నారు.

ఎంట్రెన్స్ పరీక్ష రాసినా మెరిట్ రానివారు, ఎంట్రెన్స్ రాయలేకపోయిన వారు సీట్ల కోసం ఆఫీస్ , స్కూల్ చుట్టూ తిరగకుండా ఆన్ లైన్ https://mjptbcwreishms.cgg.gov.in లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేశామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సీటు రానివారు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో కానీ, RCO ఆఫీస్ లలో కానీ, స్కూళ్లలో కానీ ఎటువంటి దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సీటు కోసం ఎవ్వరి నుంచి దరఖాస్తులు స్వీకరించబడవని, కేవలం వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సంస్థ కార్యాలయానికి రావద్దని, అడ్మిషన్లకు దరఖాస్తులు తీసుకోవడం జరుగదని ,

మధ్యవర్తులను నమ్మవద్దని మల్లయ్య బట్టు మరో సారి స్పష్టం చేశారు. ఎవరైనా సీట్లు ఇప్పిస్తామని చెప్పితే వారి మాట నమ్మవద్దని, అలా చెప్పిన వారి వివరాలు ఫోన్ : 040-23120496 ద్వారా తెలియజేయాలని ఆయన కోరారు. సీట్లు ఇప్పిస్తామని తల్లిదండ్రులను, విద్యార్థులను మోసం చేసేవారి పై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుంటామని మల్లయ్యబట్టు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News