Saturday, November 23, 2024

ప్రశాంతంగా ముగిసిన గురుకుల సిబ్బంది పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గురుకుల విద్యాసంస్థల్లో 9,210 పోస్టుల భర్తీ కోసం ఈనెల 1 నుంచి 23 వరకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ కన్వీనర్ డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) విధానంలో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 75.68 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించిన కీతో కూడిన మాస్టర్ ప్రశ్న పత్రాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయని, అభ్యర్థులు తన లాగిన్ లో సమాధాస పత్రం తో కీ తీసుకొని,

వారి కీ సంబందించిన అభ్యంతరాలను తెలియ చేయాలని కోరారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 9,210 పోస్టుల భర్తీ చేయడానికి 9 నోటిఫికేషన్‌లను విడుదల చేసిని విషయం తెలిసిందే. పరీక్షలను ఈ నెల 1 నుండి 23 వరకు నిర్వహించారు. ప్రశ్నలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 26వ తేదీలోగా లాగిన్ ఐడి ద్వారా తెలియజేయాలని, ఈమెయిల్, పిటిషన్లు స్వీకరించబడవని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా కలెక్టర్‌లకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News