Wednesday, January 22, 2025

గురుకుల డిగ్రీ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని బిసి, ఎస్‌సి, ఎస్‌టి గురుకుల డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఏప్రిల్ 28న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితా విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్ష ఫలితాలు, సీట్ల కేటాయింపు వివరాలు https://tgrdccet.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని టిజిఆర్‌డిసి సెట్- 2024 కన్వీనర్ బడుగు సైదులు తెలిపారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించబడిన విద్యార్థులు ఈనెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 బిసి గురుకుల డిగ్రీ కాలేజీలు ఉండగా ఇందులో అమ్మాయిల కోసం 15, అబ్బాయిల కోసం 15 కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, 9, 220 సీట్లను భర్తీ చేస్తామన్నారు.

26 మహిళా సాంఘీక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 7,080 సీట్లు, 21గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో (15 మహిళ, 6 మెన్ కాలేజీలు) 4,040 సీట్లు భర్తీ చేస్తామన్నారు. బిసి డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ కోర్సులతో పాటు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్ టైల్ టెక్నాలజీ, బిబిఎ, బికాం కంప్యూటర్స్, ఎంపిసిఎస్ , ఎంఎస్‌సి ఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, మరిన్ని వివరాలకు https://tgrdccet.cgg.gov.in వెబ్ సైట్ సంప్రదించాలని సైదులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News