Wednesday, January 22, 2025

హైకోర్టులో గుండెపోటుతో అడ్వకేట్ మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో గురువారం ఉదయం గోవర్థన్ అనే అడ్వకేట్ గుండెపోటుతో మృతి చెందారు. హైకోర్టు ప్రాంగణంలోని కోర్టు 14 ఎదుట గోవర్ధన్ రెడ్డి కళ్లెం అనే అడ్వకేట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, ఇతర న్యాయవాదులు ఆయనను హుటాహుటిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన గుండెపోటు కారణంగా అప్పటికే గోవర్ధన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో హైకోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. గోవర్ధన్ రెడ్డి మృతిపట్ల పలువురు న్యాయవాదులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

TS HC Advocate Govardhan died with Cardiac Arrest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News