హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాసాలమర్రిలో దళితబంధు అమలుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. నిబంధనలు ఖరారు చేయకుండానే దళితబంధు నిధులు విడుదల చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. దళిత కుటుంబాలన్నింటికీ దళితబంధు వర్తిస్తుందని చెప్పారు. నిబంధనలు ఖరారు చేసినట్లు కోర్టుకు వివరించారు. నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్ సైట్లో లేదని పిటిషనర్ తరపు లాయర్ శశికిరణ్ కోర్టుకు తెలిపారు. దీంతో జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందేమిటని హైకోర్టు ప్రశ్నించింది. జీవోను 24 గంటల్లో వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
TS HC Hear on Dalit Bandhu Scheme