Tuesday, January 21, 2025

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఫ్యాక్ట్ చెక్‌కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు నాకు చాలా ఆనందంగా వుందని, ఫ్యాక్ట్ చెక్‌ను ప్రచారం చేయాలనే ఆలోచన పట్ల తాను సంతోషిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలలో పెరుగుతున్న అవగాహన, ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో, వాస్తవాలను తనిఖీ చేసే ఒక వ్యవస్థను కలిగి ఉండటం ఎంతో అవసరం, తద్వారా ఆసక్తి ఉన్నవారందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. బుధవారం హైకోర్టు ఆవరణలో సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్‌రెడ్డి, సత్యప్రియ రచించిన తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ పుస్తకం ‘ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా‘ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మాట్లాడుతూ ఏ ఒక్కరినో శక్తివంతం చేయకుండా వ్యవస్థ సమతుల్యంగా నడవాలి ప్రతి ప్రొఫెషనల్, ప్రతి కార్యాచరణకు కొంత బాధ్యత అనేది ఉండాలి.

వార్తలు, తప్పుడు సమాచారం తప్పుడు రిపోర్టింగ్ , ఉద్దేశపూర్వకంగా హానికరమైన ప్రచారం చేయడం వంటి సంఘటనల గురించి మనందరికీ తెలుసన్నారు. దీంతో పోర్టింగ్ , తప్పుడు సమాచారం బాధితులకు ఒక వేదికను కలిగి వుండాలని సూచించారు. అందుకు ఈ ఫ్యాక్ట్ చెక్ పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, చాలా వరకు వారి మనోవేదనలను వెల్లడి చేయడంలో వారికి సహాయపడుతుందన్నారు. అనంతరం ఓయూ జర్నలిజం విభాగాధిపతి, సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ కె స్టీవెన్‌సన్ ప్రసంగిస్తూ చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్‌ల వరకు ఈ పుస్తకం ప్రకృతి వైపరీత్యాలు, పబ్లిక్ ప్రచారాలు మహమ్మారి సమయంలో ఏం జరుగుతుందనే విషయాలపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు. అసలు తప్పుడు సమాచారం ఎలా ఉద్భవిస్తుంది ఫ్యాక్ట్ చెకింగ్ ప్రాముఖ్యత ఏమిటి తప్పుడు సమాచారాన్ని కనుగొనేందుకు వాడే టూల్స్ గురించి, ఇమేజ్, టెక్ట్, వీడియో వెరిఫికేషన్ వంటి అంశాలపై ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించినట్లు చెప్పారు.

ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా పుస్తక రచయితల్లో ఒకరైన ప్రముఖ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి గతంలో రెడ్ శాండర్స్ స్మగ్లింగ్‌పై పరిశోధనాత్మక రచన ’బ్లడ్ సాండర్స్ – ది గ్రేట్ ఫారెస్ట్ హైస్ట్’ అనే పుస్తకాన్ని రచించారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రెస్ క్లబ్‌లు, మీడియా అకాడమీలలో నిజనిర్ధారణ నైపుణ్యాలపై సుధాకర్ రెడ్డి వందలాది మంది జర్నలిస్టులు, జర్నలిజం విద్యార్థులు, లా గ్రాడ్యుయేట్లు, మీడియా అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. ఇద్దరు రచయితలు గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ ఇండియా శిక్షణా నెట్‌వర్క్‌లో భాగమని బీఎన్ సత్య ప్రియ ఒక పోర్టల్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News