- Advertisement -
హైదరాబాద్: మెదక్ జిల్లాకు చెందిన ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సిఎస్ శాంతికుమారి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి,డిజిపి, మెదక్ ఎస్‌పి,డిఎస్‌పి, స్టేషన్ ఎస్‌హెచ్‌ఒలకు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఖదీర్‌ఖాన్ మృతి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కోర్టులో హాజరుపరిచిన 14 రోజులకు ఖదీర్ ఖాన్ మరణించారని అదనపు ఎజి వాదనలు వినిపించగా, ఆయన మృతికి కారణాలపై విచారణ జరుపుతామని సిజె ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చ్ 14వ తేదీని వాయిదా వేసింది.
- Advertisement -