- Advertisement -
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో షాక్ తగిలింది. టిఎస్ పిఎస్సి అప్పీల్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. బయోమెట్రిక్ అమలు చేయకుండా టిఎస్ పిఎస్సి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టిఎస్ పిఎస్సి, డివిజన్ బెంచ్ అప్పీల్ కు వెళ్లింది.
ఈ నేపథ్యంలో బుధవారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు నిర్ణయం సరైనదేనని, ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాల్సిందేనని హైకోర్టు తెలిపింది. పరీక్షలో అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.
- Advertisement -