- Advertisement -
హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ చేపట్టింది. మాస్టర్‌ప్లాన్‌లోని అభ్యంతరాలపై కెఎ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. రైతులను సంప్రదించకుండానే మాస్టర్ ప్లాన్ రూపొందించారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
మున్సిపల్ కౌన్సిల్ కూడా దీనిని రద్దు చేసిందని కోర్టుకు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 13కి వాయిదా వేసింది.
- Advertisement -