Monday, December 23, 2024

ఉపాధ్యాయ బదిలీలపై హైకోర్టు స్టే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. బదిలీల నిబంధనలపై నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియపై మార్చి 14 వరకు స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

టీచర్ల బదిలీలు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఉద్యోగ దంపతులు, యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. నిబంధనల్లో సవరణలకు అసెంబ్లీ ఆమోదం పొందలేదని ర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News