Monday, December 23, 2024

బిఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు.. రూ.5లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

TS HC verdict on BRS MLA Vanama Venkateswara rao

భద్రాద్రి కొత్తగూడెం: నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫీడవిట్ లో తప్పుడు ధృవపత్రాలు ఇచ్చారని వనమాపై ఆరోపణలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు.. వనమా ఎన్నిక చెల్లదని, రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించింది. తప్పుడు అఫీడవిట్ సమర్పించినందుకు వనమాకు రూ.5 లక్షల జరిమానా విధించింది. కాగా, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, వనమా ఎన్నికను సవాల్ చేస్తూ 2019లో జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ వేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News