Wednesday, January 22, 2025

హైదరాబాద్ లో కోవిడ్ కేసులు.. మాస్కులు తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

కోవిడ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈనెల 18వ తేదీ నుంచి ఇప్పటివరకూ ఆరు కేసులు బయటపడ్డాయి. పైగా ఈ కేసులన్నీ హైదరాబాద్ లోనే వెలుగుచూడటం గమనార్హం. మిగతా తెలంగాణ జిల్లాల్లో కోవిడ్ కేసుల సమాచారం లేదు.

ఈ నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. మాస్కులు ధరించనివారికి జరిమానా విధిస్తారని ఆయన తెలిపారు. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. పదేళ్ల లోపు పిల్లలు, గర్భిణులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండటం మంచిదని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News