హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బిజెపి ఎంఎల్‌ఎలపై సస్పెన్షన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. బిజెపి ఎంఎల్‌ఎల పిటిషన్‌పై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సమయంలో బిజెపి ఎంఎల్‌ఎలు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని సభ నుంచి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు కూడా బిజెపి ఎంఎల్‌ఎలను సస్పెండ్ చేశారు. ఈ విషయమై బిజెపి ఎంఎల్‌ఎలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని తెలంగాణ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదించారు. అయితే ముందస్తు ప్లాన్ మేరకు బిజెపి ఎంఎల్‌ఎలను సస్పెండ్ చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు సెక్రటరీకి నోటీసులు పంపింది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే బిజెపి సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సమావేశాలు ముగిసేవరకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 7న శాసనసభలో మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే హరీష్‌రావు బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తుండగా బిజెపి సభ్యులు వ్యతిరేక నినాదాలు చేశారు. బిజెపి సభ్యులు రఘునందన్‌రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్‌లను ఈ సెషన్ ముగిసేవరకు శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. మొత్తం ముగ్గురు బిజెపి సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. బిజెపి సభ్యుల సస్పెన్షన్ అనంతరం హరీష్‌రావు సభలో తన బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తున్నారు. శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులు అసెంబ్లీ గేటు బయట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు ఎంఎల్‌ఎలను బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై బిజెపి హైకోర్టును ఆశ్రయించింది.