- Advertisement -
హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును కోరారు. అయితే, పిటిషన్ కు అర్హత లేదని శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. 2018లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలపొందారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో శ్రీనివాస్ గౌడ్..ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే, ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ తన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించారని మహబూబ్ నగర్ జిల్లా వాసి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలా ఉండగా, ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించినందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదని మంగళవారం హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
- Advertisement -