Sunday, December 22, 2024

వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ లభించింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ప్రతి శనివారం సిబిఐ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరో వైపు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని కూడా షరతు విధించింది. విచారణకు సహకరించాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించింది.

ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు విచారణకు హాజరు కావాలని కోరింది. రూ. 5 లక్షలతో రెండు పూచీకత్తలను సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను భయపెట్టడం,లేదా ఆధారాలను చెరపవద్దని కూడా ఆదేశించింది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనున్నట్టుగా ఈ నెల 27న ప్రకటించిన విషయం విదితమే. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించేలా తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆదేశించాలని అవినాష్ రెడ్డి ఈ నెల 22న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి స్థాయిలో విచారించి తుది ఉత్తర్వులివ్వాలని ఆ పిటిషన్‌లో అవినాష్ రెడ్డి కోరారు.

ఈ పిటిషన్‌పై ఈ నెల 23న సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈ నెల 25న ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు వేకేషన్ బెంచ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ నిర్వహించింది. అన్ని వర్గాల వాదనలను హైకోర్టు విన్నది. ఈ నెల 31న తుది తీర్పును వెల్లడించనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వెల్లడించింది. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే షరతులతో కూడిన ముందస్తు బెయిల్ గాకోర్టు తెలిపింది. సిబిఐ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ముందస్తు బెయిల్ మంజూరైందని అవినాష్ రెడ్డి న్యాయవాది నాగార్జునరెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News