Wednesday, November 6, 2024

హనుమాన్ యాత్రకు హైకోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్‌ః నగరంలో మంగళవారం నిర్వహించతలపెట్టిన వీర హనుమాన్ విజయయాత్రకు సోమవారం హైకోర్టు అనుమతి ఇచ్చింది. విహెచ్‌పి, భజరంగ్‌దళ్ తలపెట్టిన శోభాయాత్రకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. మంగళవారం ఉదయం 9.30 నుంచి మధ్నాహ్నం 1.30 గంటల మధ్య యాత్ర పూర్తిచేయాలని సూచించింది. హైదరాబాద్‌లోని గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు శోభాయాత్రకు అనుమతి లభించింది. అలాగే శోభాయాత్రలో 21 మందికి మించి పాల్గొనవద్దని స్పష్టం చేసింది. శోభాయాత్రలో ఒక ద్విచక్రవాహనంపై ఒక్కరే ప్రయాణించాలని సూచించింది. శోభాయాత్రను వీడియో చిత్రీకరించి నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. కొవిడ్ నిబంధనలు పాటించాలని విహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది.

TS High Court permission to Hanuman Shobha Yatra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News