Monday, December 23, 2024

పబ్బులకు హైకోర్టు షాక్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పబ్బులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నూతన సంవత్సర వేడుకలకు సిద్దమవుతున్న పబ్బులపై కోర్టు ఆంక్షలు విధించింది. నగరంలోని పబ్బుల వద్ద జరుగుతున్న న్యూసెన్స్‌పై పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

దీనిపై గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలపై పబ్బుల నిర్వాహకులు హైకోర్టులో వెకెట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని ఆదేశించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పది పబ్బుల్లో రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సౌండ్స్‌కు అనుమతి ఇచ్చేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News