Saturday, November 23, 2024

నలుగురు హైదరాబాద్ పోలీసు అధికారులకు జైలు శిక్ష..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసు అధికారులకు నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది. గతేడాది జక్కా వినోద్ కుమార్ రెడ్డి, జక్కా సౌజన్య రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని, ముఖ్యంగా సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సిఆర్‌పిసి 41ఎ నోటీసు ఇవ్వలేదని సదరు పోలీసు అధికారులపై అభియోగం నమోదైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఆర్‌పిసి సెక్షన్ 41ఎ కింద నోటీసు ఇవ్వకుండానే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేసినట్లు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు. వాదనల పూర్తి అయిన అనంతరం జాయింట్ సిపి ఎఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఎసిపి సుదర్శన్, జూబ్లీహిల్స్ సిఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ నరేశ్‌కు నాలుగు వారాలు జైలుశిక్ష విధించడంతో పాటు వారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిపికి ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పీలుకు వెళ్లేందుకు వారికి శిక్ష అమలును 6 వారాలు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

TS high court sentenced to 4 police officers in jail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News