- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ధరణిపై మధ్యంతర ఉత్తర్వులు జూన్ 21 వరకు పొడిగించింది. ధరణిపై అభ్యంతరాలను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని ఏజీ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం కావాలని ఏజీ కోర్టును కోరారు. ధరణిపై దాఖలైన ఏడు పిల్స్ పై సిజె జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదన్న హైకోర్టు ధరణి అంశంలో 2 పిల్స్ పై మాత్రమే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మరో ఐదు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు తోసిపుచ్చింది.
TS high court stay on non agricultural Land registrations
- Advertisement -