మనతెలంగాణ/హైదరాబాద్: విఆర్‌వొల బదిలీపై సోమవారం హైకోర్టు స్టే విధించింది. 56 మంది విఆర్‌వొల బదిలీచేస్తూ జివొ 121 ప్రభుత్వం జారీచేసింది. ఈక్రమంలో జివొ 121ను సవాలు చేస్తూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించింది. ఇప్పటికి విఆర్‌వొలు అందరూ జాయిన్ అయ్యారని, 56 మంది మాత్రమే ఇంకా పోస్టింగ్‌లలో జాయిన్ కాలేదని ఎజి న్యాయస్థానానికి తెలిపారు. దీంతో 56 మందిని రెవిన్యూ శాఖలో కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. రెండేళ్లుగా ఖాళీగా ఉన్న విఆర్‌వొలను ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5485 మంది విఆర్‌వొలు ఉండగా అందరినీ ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు గత నెల 23న జివొ-121ను విడుదల చేసిన విషయం విదితమే.
TS High Court Stay on Transfer Process of VROs