హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు హైకోర్టులో మంగళవారం ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యులను ష్తిష్టపాల్జేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ కనుగోలు హైదరాబాద్ పోలీసుల ఎదుట హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. తమ ఎదుట హాజరుకావాలని ఆదేశిస్తూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జారీచేసిన సమన్లను సవాలు చేస్తూ సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
డిసెంబర్ 30న వివరణతో తమ హాజరుకావాలని ఆదేశిస్తూ సైబర్‌క్రైమ్ పోలీసులు సిఆర్‌పిసి సెక్షన్ 41(ఎ) కింద సునీకు ఇదివరకు నోటీసులు జారీచేయగా వీటిని ఆయన హైకోర్టులో సవాలు చేశారు. సైబర్‌క్రైమ్ పోలీసులు జారీచేసిన సమన్ల అమలుపై స్టే విధించాలని సునీల్ కోర్టును కోరారు. డిసెంబర్ 30న పోలీసుల ఎదుట ఆయన హాజరుకాలేదు. కాగా..జనవరి 8న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశిస్తూ సైబర్‌క్రైమ్ పోలీసులు తాజాగా సునీల్‌కు ఆదేశాలు జారీచేశారు.