Sunday, November 3, 2024

టిఎస్‌ ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం విడుదల చేసింది. ఆగస్టులో ఐసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ అధ్యక్షతన బుధవారం వర్చువల్ విధానంలో ఐసెట్ కమిటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఐసెట్ షెడ్యూల్, సిలబస్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఐసెట్ కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్ బి.జనార్ధన్‌రెడ్డి, ఐసెట్ కన్వీనర్ కె.రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 3న ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్ష ఫీజును రూ.650(ఎస్‌సి,ఎస్‌టిలకు రూ.450)గా నిర్ణయించారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో అభ్యర్థులు జులై 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రూ.250 అపరాధ రుసుంతో జూన్ 30 వరకు, రూ.500 అపరాధ రుసుంతో జులై 15 వరకు, రూ.వెయ్యి అపరాధ రుసుంతో జూలై 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టులో మూడు సెషన్‌లలో ఐసెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

TS ICET 2021 Schedule Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News