Monday, December 23, 2024

ఈనెల 15వ తేదీన ఐసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రం ప్రభుత్వం కొత్తగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ఎంబిఎ, ఎంసిఏ సీట్లను మంజూరు చేసింది. ఈ సీట్లను ప్రత్యేకంగా భర్తీ చేసేందుకు ఈనెల 15 వ తేదీ ఐసెట్ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. ఎంబిఏ 3060 సీట్లు, ఎంసిఏలో 2,700 సీట్లను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికేట్ పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. 16న సర్టిఫికేట్ వెరిఫికేషన్, 16, 17న వెబ్ ఆప్షన్లను కూడా ఇవ్వాలి. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని, 20న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News