Monday, January 20, 2025

టిఎస్ ఐసెట్ -2024 షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిఎస్ ఐసెట్ 2024 షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్లు ఎస్.కె. మహమూద్, వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ టిఎస్ ఐసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 5వ తేదీన టిఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ తాటికొండ రమేశ్ వెల్లడించారు. మార్చి 7వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. జూన్ 4, 5 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.

మార్చి 6 నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తులు
రాష్ట్రంలో బి.ఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిఎస్ ఎడ్‌సెట్ 2024 షెడ్యూల్‌ను విడుదలయ్యింది. మార్చి 4న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కన్వీనర్ టి.మృణాళిని తెలిపారు. మార్చి 6 నుంచి మే 5 దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. మే 23వ తేదీన ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News