Thursday, January 23, 2025

అక్టోబర్ 8 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

TS ICET Counseling from October 8

షెడ్యూల్ ప్రకటించిన ఉన్నత విద్యామండలి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల సీట్ల భర్తీకి అక్టోబరు 8 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. తొలి విడత కౌన్సెలింగ్ అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వచ్చే నెల 8 నుంచి 12 వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని, వచ్చే నెల 15 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే నెల 18వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐ-సెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)ను జులై 28న తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు

అక్టోబరు 8 నుంచి 12 వరకు స్లాట్ బుకింగ్

అక్టోబరు 10 నుంచి 13 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

అక్టోబరు 10 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు

అక్టోబరు 18న ఎంబిఎ,ఎంసిఎఏ తొలి విడత సీట్ల కేటాయింపు

అక్టోబరు 23 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం

అక్టోబరు 23 నుంచి 25 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు

అక్టోబరు 28న ఎంబిఎ, ఎంసిఎ తుది విడత సీట్ల కేటాయింపు

అక్టోబరు 28న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News