Monday, January 20, 2025

15 నుంచి ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 15 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 15న స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించి, 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ నెల 16,17 తేదీలలో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ నెల 20వ తేదీన సీట్లు కేటాయించనున్నట్లు ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 30,31 తేదీలలో కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 30న స్పాట్ అడ్మిషన్లను నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News