Tuesday, December 24, 2024

రేపు టిఎస్ ఐసెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టిఎస్ ఐసెట్ ఫలితాలు గురువారం(జూన్ 29) విడుదల కానున్నాయి. ఈ మేరకు బుధవారం ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వరలక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనెజ్మెంట్ సెమినార్ హాలులో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర

ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఐసెట్ ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టిఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్షను గత నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని 20 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరిగింది. తెలంగాణలోని 16 కేంద్రాలు, ఎపిలోని నాలుగు కేంద్రాల్లో పరీక్ష జరుగగా, 70,900 మంది విద్యార్థులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News