Friday, November 15, 2024

25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -
TS Inter 1st Year Exam 2021 Date
70% సిలబస్‌తో ఎక్కువ చాయిస్‌లతో
ప్రశాపత్రం స్టడీ మెటీరియల్ ఉచితం జంతు,వృక్ష, భౌతిక శాస్త్రాలు,
గణితం, చరిత్ర స్టడీ మెటీరియల్ మంగళవారం
నుంచే అందిస్తున్నాం : మంత్రి సబిత , ఇంటర్
బోర్డు కార్యదర్శి జలీల్
ఈనెల 25 నుంచి మొదటి సంవత్సరం ఎగ్జామ్స్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా కొంతకాలం ప్రత్యక్ష తరగతులకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ విద్యార్థులకు 70 శాతం, 50 శాతం సిలబస్ ఛాయిస్‌తో కూడిన అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.అలాగే మరిన్ని ఛాయిస్‌లు ఉండేలా ప్రశ్నాపత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ చెప్పారు. అలాగే విద్యార్థుల కోసం ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన వారితో ఈ స్టడీ మెటీరియల్‌ను రూపొందించినట్లు ఆమె చెప్పారు. జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, గణితం, భౌతికశాస్త్రం, చరిత్రకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్‌ను మంగళవారం నుంచే అందుబాటులో ఉంచుతున్నామని, మిగతా సబ్జెక్టుల స్టడీ మెటీరియల్‌ను కూడా త్వరలోనే అందిస్తామని విద్యాశాఖ మంత్రి తెలియజేశారు.

ఈ స్టడీ మెటీరియల్స్‌ను www.tsbie.cgg.gov.in వెబ్‌సైటు నుంచి పొందవచ్చని తెలిపారు. మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ కమిషనర్ ఉమర్ జలీల్, ఉడిత్యాల రమణ, మహేందర్ కుమార్, వసుంధరా దేవి తదితరులు పాల్గొన్నారు.

70 శాతం సిలబస్ ఆధారంగా..

కరోనా పరిస్థితుల కారణంగా గత ఏడాది 30 శాతం పాఠ్య ప్రణాళికను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా 70% సిలబస్ ఆధారంగానే పరీక్షలు ఉండేలా చూడాలని సూచిస్తూ కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. గత మే నెలలో జరగాల్సిన ద్వితీయ ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారికి మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలోనూ వేసి ధ్రువపత్రాలు ఇచ్చింది. ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులను మాత్రం పరీక్షలు లేకుండానే రెండో ఏడాదిలోకి ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అనుకూల పరిస్థితుల్లో పరీక్షలు జరుపుతామని ఆనాడు పేర్కొంది. విద్యార్థులు మాత్రం ప్రమోట్ అంటే 35% కనీస మార్కులతో పాసైనట్లేననుకున్నారు. ఒకవేళ భవిష్యత్తులో పరీక్షలు జరిపినా ఇష్టం లేకుంటే రాయాల్సిన అవసరం లేదని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు కాలపట్టిక ప్రకటించింది. కాగా ఈ ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు పెంచామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News