Saturday, November 23, 2024

నేటి నుంచే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

TS Inter 1st Year Exam from today

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు
రాష్ట్రవ్యాప్తంగా 1,768 పరీక్షా కేంద్రాలు
నిమిషం ఆల్యమైనా నో ఎంట్రీ
ప్రతీ పరీక్షా కేంద్రంలో రెండు ఐసొలేషన్ సెంటర్లు
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ
ఫస్టియర్ పరీక్షలు రాయనున్న సెకండియర్ విద్యార్థులు

మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సోమవారం(అక్టోబర్ 25) నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 3 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,768 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 4,59,228 మంది విద్యార్థులు హాజరుకానుండగా, అందులో బాలురు 2,05,360 మంది,బాలికలు 2,04,537 మంది ఉన్నారు. విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావచ్చు.

హాల్‌టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించిన విధంగా 70 శాతం సిలబస్‌కే పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. వ్యాక్సిన్ వేయించుకున్న అధ్యాపకులు, సిబ్బందిని మాత్రమే పరీక్షల విధులకు నియమించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బంది మాస్కును తప్పనిసరిగా ధరించి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాలని, భౌతికదూరం పాటించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. బెంచీలు, డెస్కులు, డోర్లు, కిటికీలను శానిటైజ్ చేస్తారు. ప్రతీ కేంద్రంలో రెండు ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. నున్నారు. ఒక స్టాఫ్ నర్సు గానీ ఎఎన్‌ఎంను గానీ ప్రతీ కేంద్రంలో అందుబాటులో ఉంచుతారు.

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు నిమిషం నిబంధన అమలులోకి ఉంది. పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు.

వాటర్ బాటిల్‌కు అనుమతి

ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వాటర్ బాటిల్‌ను వెంట తెచ్చుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. గతంలో ప్రకటించిన విధంగా 70 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహిస్తున్నందున.. ఆ సిలబస్‌కు పరిమితమయ్యే పరీక్ష ఉంటుంది. మూడు సెట్ల పరీక్ష పత్రాలను ఎంపిక చేశారు. విద్యార్థులు పరీక్షల సన్నద్ధత కోసం బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ పెంచారరు.

పాజిటివ్ ఉంటే అనుమతి లేదు

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద థర్మోమీటర్లతో శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించి లోపలికి అనుమతిస్తారు. ఎవరికైనా అధిక శరీర ఉష్ణోగ్రతలు ఉన్నట్లు గుర్తించినా, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా వారికి ప్రత్యేక గది కేటాయిస్తారు. కొవిడ్ పాజిటివ్ ఉన్న విద్యార్థులను మాత్రం పరీక్షలకు అనుమతించమని బోర్డు స్పస్టం చేశారు.

ఆదివారమూ పరీక్ష

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న ఉన్న కారణంగా.. ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షను మరుసటి రోజు నిర్వహిస్తున్నామని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈనెల 31 ఆదివారమైనా పరీక్ష ఉంటుంది.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 4,59,228 మంది
పరీక్షా కేంద్రాలు 1,788
ఇన్విలేటర్లు 25,258
ఫ్లైయింగ్ స్కాడ్లు 70

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News