Monday, January 20, 2025

15నుంచి ఇంటర్ ప్రవేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింంది. ఈ నెల 15 నుంచి జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించాలని తెలిపింది. జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానుండగా, అదే నెల 30వ తేదీలోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఒక్కో సెక్షన్‌లో 88 మంది విద్యార్థులకు మించరాదని బోర్డు స్పష్టం చేసింది. ప్రవేశాల కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు పరీక్షలు నిర్వహించవద్దని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జూనియర్ కాలేజీల ప్రవేశాలలో ఎస్‌సిలకు 15 శాతం, ఎస్‌టిలకు 10 శాతం, బిసిలకు 29 శాతం,ఇడబ్లూఎస్‌కు 10 శాతం, వికలాంగులకు 3 శాతం,ఎన్‌సిసి, స్పోర్ట్‌కు 5 శాతం, ఎక్స్ సర్వీస్‌మెన్, డిఫెన్స్ కేటగిరీకి 3 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలిపారు.

బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్మీడియేట్ బోర్డు ద్వారా అనుబంధ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల్లో మాత్రమే ప్రవేశాలు పొందాలని నవీన్ మిట్టల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలల జాబితాను acadtsbie.cgg.gov.in, tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, కో ఆపరేటివ్, తెలంగాణ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఇన్సెంటివ్,మైనార్టీ, కెజిబివి, మోడల్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ డిగ్రీ కాలేజీలు, జనరల్, ఒకేషనల్ స్ట్రీమ్‌లలో రెండేళ్ళ కాలపరిమితితో కూడా ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను ఈ నెల 15నుంచి విక్రయిస్తారని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ళకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News