Friday, November 15, 2024

ఈరోజు నుంచి ఇంటర్ కళాశాలలకు సెలవులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఇంటర్ కళాశాలకు సమ్మర్ సెలవులను ప్రకటించింది ఇంటర్ బోర్డు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో.. మార్చి 30వ తేదీని 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి చివరి పని దినంగా బోర్డు ప్రకటన విడుదల చేసింది. మార్చి 31వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు రెండు నెలల పాటు సెలవులు ఉంటాయని తెలిపింది. మళ్లీ జూన్ 1న అన్ని కాలేజీలు తిరిగి పున:ప్రారంభమవుతాయిని చెప్పింది.

ఈ సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ఇంటర్ కాలేజీలకు వర్తిస్తాయని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏ కాలేజీ అయినా విద్యార్థులకు క్లాస్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఇంటర్ బోర్డు.

కాగా, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకూ ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 9,22,520 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రస్తుతం ఇంట‌ర్ ప‌రీక్ష‌ల పేప‌ర్‌ వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మే మొదటి వారంలో పరీక్షల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News