Friday, November 22, 2024

ఇంటర్ ఫస్ట్ ఇయర్ రెండు పరీక్షలు రీ షెడ్యూల్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(అక్టోబర్ 25) నంచి నవంబర్ 3వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. అయితే, 2 పరీక్షలను రీ షెడ్యూల్ చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఆదివారం రోజు కూడా పరీక్ష నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలిల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”మొత్తం 4,59,237మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. దీంతో 1,768 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్షల నిర్వహణకు 25వేల మంది ఇన్విజిలేటర్స్ పని చేయనున్నారు. 70శాతం సిలబస్ నుంచి ప్రశ్నలు.. 50శాతం పైగా ఛాయిస్ ఉంటుంది. ఈ నెల 30వ తేదిన హుజూరాబాద్ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో రెండు పరీక్షలను రీ షెడ్యూల్ చేశాం. థర్మల్ స్రీనింగ్ ఉంటుంది. ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉంటే ప్రత్యేక రూమ్ లో పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్ సరిపోతుంది.. ప్రిన్స్ పాల్ సంతకం అవసరం లేదు. ప్రతీ సెంటర్ లో మెడికల్ కిట్స్, శానిటైజేషన్ ఉంటుంది” అని వివరించారు.

TS Inter Board makes Rescheduled for Inter 1st Year

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News