- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిసాయి. గత నెల 25వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు బుధవారంతో ముగిసాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,768 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉన్న కారణంగా.. ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షను ఆ తర్వాత రోజు అంటే ఈ నెల 31(ఆదివారం) నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ బోర్డు అధికారులు విజయవంతంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు వ్యాక్సిన్ వేయించుకున్న అధ్యాపకులు, సిబ్బందిని మాత్రమే పరీక్షల విధులకు నియమించారు. కొవిడ్ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలలో బెంచీలు, డెస్కులు, డోర్లు, కిటికీలను శానిటైజ్ చేశారు. ప్రతీ కేంద్రంలో రెండు ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేశారు.
- Advertisement -