Monday, January 20, 2025

26న ఇంటర్ ఫలితాలు?

- Advertisement -
- Advertisement -

TS SSC Results 2022 will release on June 26th

26న ఇంటర్ ఫలితాలు?

తప్పులు దొర్లకుండ అధికారుల జాగ్రత్తలు
30లోగా ‘పది’ ఫలితాలు

మన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ నెల 26న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా, ఫలితాల ప్రక్రియపై అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీనే ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని మొదట అధికారులు భావించారు. అయితే, ఫలితాల వెల్లడిలో గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితాలను ఒకటి, రెండు సార్లు పరిశీలిస్తున్నారు. ఇంటర్ పరీక్షల ఫలితాల వెల్లడి కొంత ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ తప్పులు మాత్రం దొర్లకూడదని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల ప్రక్రియ సక్రమంగా ముగిసిందని నిర్థారించుకున్న తర్వాతనే ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఫలితాల ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు మూడు రోజుల సమయం పట్టనున్న నేపథ్యంలో ఈ నెల 26వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. గత ఏడాది కరోనా నేపథ్యంలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 49శాతం మాత్రమే నమోదైంది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు సరిగ్గా పరీక్షలు రాయలేకపోయారని భావించిన ప్రభుత్వం, కనీస మార్కులతో అందరినీ పాస్ చేసింది. మరోవైపు, పదవ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30లోగా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన అనంతరం టెక్నికల్‌గా అన్ని అంశాలను పరిశీలించి ఫలితాలను విడుదల చేయనున్నారు.

TS Inter Results 2022 will release on June 26th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News