Friday, December 20, 2024

రేపు ఇంటర్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

ఇంటర్మీయట్ పరీక్షల ఫలితాలను బుధవారం(ఏప్రిల్ 24) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఈ నెల 10వ తేదీ వరకు మూల్యాంకణం పూర్తయ్యింది. అయితే, మార్కుల నమోదు పాటు సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. జవాబుపత్రాలను మూడు సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఫలితాల కోసం tsbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్‌సైట్లలో సంప్రదించాలని ఇంటర్ బోర్డు సూచించింది. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థుల సౌలభ్యం కోసం మార్కుల జాబితాను వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News