- Advertisement -
రాష్ట్రంలో మంగళవారం(ఏప్రిల్ 22) ఇంటర్మీడియేట్ ఫలితాలు వెలువడన్నుయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తారని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ కార్యక్రమంలో రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటారని పేర్కొన్నారు. గత నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.
- Advertisement -